ఇక ఈ జనరేషన్ లో స్మార్ట్ ఫోన్లకి ఎంత క్రేజ్ వుందో స్మార్ట్ వాచెస్ కి కూడా అంతే క్రేజ్ పెరిగిపోతుందనే చెప్పాలి. ఇక మార్కెట్ లో స్మార్ట్ ఫోన్స్ తో పాటు స్మార్ట్ వాచ్ త‌యారీ రంగంలో పోటీ పెరుగుతోన్న క్రమంలో త‌క్కువ ధ‌ర‌కే స్మార్ట్ వాచ్‌ల‌ను తీసుకొస్తున్నాయి కొన్ని కంపెనీలు.పెద్ద పెద్ద టాప్ బ్రాండ్ లే స్మార్ట్ వాచ్ రంగంలో తెగ పోటీ పడుతున్నాయి. ఇక జియోని కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైలిష్ అండ్ స్లిమ్ స్మార్ట్ ఫోన్ గా ఈ కంపెనీకి మంచి పేరు వుంది.ఈ క్ర‌మంలోనే మిగతా బ్రాండ్స్ తో పోటీ పడుతూ తాజాగా జియోనీ స్మార్ట్ ఫోన్ కంపెనీ చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీతో కొత్త స్మార్ట్ వాచ్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇక జియోని కంపెనీ వారు కస్టమర్లని ఆకట్టుకునేందుకు చాలా త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఫీచ‌ర్ల‌తో ఈ స్మార్ట్ వాచ్ ని తయారు చేసి లాంచ్ చేశారు...ఇక దీని ఫీచర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..



*ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ వీ4.0 టెక్నాలజీతో ప‌నిచేస్తుంది. ఇక ఈ వాచ్‌ను కేవ‌లం రెండు గంట‌ల్లోనే చాలా ఫాస్ట్ గా ఫుల్ ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు.


*ఇక ఈ స్మార్ట్ వాచ్ 1.3 ఇంచెస్ టీఎఫ్‌టీ ఎల్సీడీ టచ్ స్క్రీన్‌, 240 x 240 పిక్సెల్‌ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి వుంది.అలాగే ఇది ఆండ్రాయిడ్ 5.1, ఇంకా ఐవోఎస్ 9.0 ఆ పై ఆపరేటింగ్ సిస్టంలకు కూడా స‌పోర్ట్ చేస్తుంది.


*ఇక స్టైలిష్ స్మార్ట్ వాచ్ రియ‌ల్‌టైమ్ హార్ట్ రేట్ మానిట‌ర్‌తో పాటుగా వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ వంటి ఇతర స్పోర్ట్స్ మోడ్స్‌ను కూడా ఇది చాలా ఫాస్ట్ గా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఇందులో ఉంది.


*ఇక కెమెరా విషయానికి వస్తే...ఈ స్మార్ట్ వాచ్ కి రిమోట్ కెమెరా ఫీచ‌ర్ దీనికి ప్ర‌త్యేక‌త‌ అని చెప్పాలి..ఈ కెమెరా ద్వారా వాచ్ నుంచే కనెక్ట్ చేసిన ఫోన్‌లో ఫొటోలు తీయవచ్చు.


*మార్కెట్ లో స్మార్ట్ వాచెస్ కి పెరుగుతోన్న పోటీకి అనుగుణంగానే జియోనీ కంపెనీ సరి కొత్త ఆలోచనతో చౌక ధరలో ఈ కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఇక జియోనీ స్టైల్‌ఫిట్ జీఎస్‌డబ్ల్యూ7 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధ‌ర కేవ‌లం రూ. 2,099గా కావ‌డం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక వారంటీ విషయానికి వస్తే ఈ వాచ్‌పై ఒక సంవత్సరం వారంటీ, అలాగే స్ట్రాప్‌పై ఆరు నెలల వారంటీని కంపెనీ వారు ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: