విద్యుత్తు ఉత్పత్తి చేయడం అనేది ఎంతో పరిణతితో కూడుకున్న పని. కానీ కేవలం మన నడకతో కరెంట్ ఉత్పత్తి చేయడం అంటే అది జరిగే పనేనా. ఇక్కడ ఈ వీడియో చూస్తే మాత్రం నడకతో కాదు కేవలం ఒకే ఒక్క అడుగుతో కూడా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అన్నది  నిరూపితమవుతుంది. పవర్ వాకింగ్ అనే పదం ఎప్పుడైనా విన్నారా.. సైంటిస్టులు ఇక ఈ పదాన్ని నిజం చేయబోతున్నారు. చెక్క ఫ్లోరింగ్ సిలికాన్ కలయిక ద్వారా ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ ప్రారంభించే దిశగా ప్రస్తుతం సైంటిస్టులు అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.



 ఈటిహెచ్ జూరిచ్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లు దీనికి సంబంధించిన ప్రయోగాలు నిర్వహించగా.. మొదటి ప్రయత్నంలోనే విజయవంతం అయ్యారు. ఇక నానో జనరేటర్ పేరుతో తయారైన ఈ డివైజ్ ఆధారంగా ఓల్టేజ్ కరెంట్ ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యారు.  అయితే శాస్త్రవేత్తలు ఈ ప్రాసెస్ ఎలా నిర్వహించారు అనే విషయాన్ని తెలియ జేసే విధంగా ఒక వీడియో విడుదల చేశారు. వీడియో చూసి తన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఎంతోమందిని ఆకర్షిస్తోంది.  నానో క్రీస్టల్ పొందుపరిచిన చెక్క ఫ్లోర్ డానికి సిలికాన్ కోటింగ్ తో డివైస్ ని రూపొందించారు.



 వీటి వల్ల  గట్టిగా అడుగు వేయగానే ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇక ఉత్పత్తి అయిన కరెంట్ తో ఎల్ఈడీ బల్బ్ లేదా చిన్న ఎలక్ట్రిక్ డివైజ్లను పని చేసేలా చేయవచ్చు. ట్రైబో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్లను ఏ మెటీరియల్ అయితే కోల్పోతుందో ట్రైబో పాజిటివ్ అవుతుంది. ఏదైతే పొందుతుందో అది ట్రైబో నెగిటివ్ అంటారు  ఇక ఈ సూత్రం ఆధారంగానే నానోజనరేటర్ కూడా పని చేస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. చెక్క బోర్డు ఎలక్ట్రాన్లను ఆకర్షించడం వికర్శించడం మీద ఆధారపడి పని చేస్తుందని అంటున్నారు. ఇక దీనిని మరింత మెరుగ్గా తీర్చిదిద్ది ఇంటి అవసరాలకు అనుగుణంగా  ఉపయోగించే విధంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: