మొన్నటి వరకూ అబ్బాయిలు మాత్రమే ఎక్కువగా కొట్టుకునే వారు అనే భావన ఉండేది. అంతే కాదు చిన్న చిన్న విషయాలకు గొడవలు తీసుకుంటూ దారుణంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండేవారు అని అనుకునేవారు చాలామంది. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మాత్రం అబ్బాయిలు కాదు అమ్మాయిలు కూడా అంతకు మించి అనే రేంజ్ లోనే కొట్టుకుంటున్నారు అని అర్థమవుతుంది. గొడవలు చూసిన తర్వాత అమ్మాయిల గొడవల ముందు అబ్బాయిలు కొట్టుకోవడం ఏమీ పని చేయదేమో అన్న భావన కూడా అందరిలో కలుగుతోంది. ఇటీవల కాలంలో ఏకంగా నడి రోడ్డుమీద అందరూ చూస్తున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అమ్మాయిలు దారుణంగా కొట్టుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.


 ఏకంగా ఒక అబ్బాయి కోసం ఇద్దరు లేడీస్ జుట్టు పట్టుకొని మరి అందరి ముందే దారుణంగా పోట్లాడుకోవడం లాంటి వీడియోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.  ఇలాంటి వీడియో ఏదైనా ట్విట్టర్లోకి వచ్చిందంటే చాలు అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. స్కూల్ విద్యార్థులు ఏకంగా ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు.  ఈ ఘటన కాన్పూర్లోని ఓ ప్రసిద్ధ ప్రైవేట్ స్కూల్ గదిలో జరగడం గమనార్హం.


 ఈ వీడియోలో చూసుకుంటే ముగ్గురు అమ్మాయిలు కూడా స్కూల్ యూనిఫామ్ లోనే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని అత్యంత దారుణంగా హింసాత్మకంగా కొట్టుకోవడం కనిపిస్తూ ఉంది. దారుణమైన బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. క్లాస్ రూమ్ లో ఉన్న బెంచీల పై పడుతూ లేస్తూ కొట్టుకున్నారు. పక్కనే ఉన్న వారు ఆపేందుకు ప్రయత్నించగా ఆ ముగ్గురు అమ్మాయిలు మాత్రం వినిపించుకోలేదు. ఈ వీడియో కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారిపోయి హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: