కరోనా ఈ పేరు వినగానే ప్రజలు సైతం భయభ్రాంతులకు గురవుతారు. ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోవడమే కాకుండా చాలామంది చాలా కోల్పోయారు. 2019లో లాక్డౌన్ పరిస్థితులు అందుకు నిదర్శనం. అయితే ఈసారి వచ్చేది మాత్రం మామూలు కరోనా వేరియంట్ కాదని కేసులు మరింత కూడా పెరుగుతాయని ఆసియాలో రెండు నగరాలలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా కొత్తగా కరోనా కేసులు ఎక్కువవుతున్నాయట. ప్రస్తుతం ఎండాకాలం అవుతూ ఉన్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.


హాంకాంగ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయని మే 3 నుంచి మరణాలతో సహా ఎక్కువగా కేసులు నమోదైనట్లుగా అక్కడి ఆరోగ్యశాఖ ప్రకటించింది. 7 మిలియన్లకు పైగా ఉన్న గత రెండేళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే ఇది తక్కువే అయినా కానీ వైరల్ కోవిడ్ సంబంధిత అనారోగ్య సమస్యలతో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. సింగపూర్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని. మే 3 నుంచి కొత్త కేసులు మొదలవుతున్నాయని కేవలం ఏడు రోజులలో 14,200 మందికి పైగా చేరారని తెలియజేస్తున్నారు. ప్రతిరోజు దాదాపుగా 30 శాతం మంది జనాభా పెరుగుతున్నారని అక్కడ ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.


చైనా విషయానికి వస్తే అక్కడ అధికారులు కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని తెలియజేస్తున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన డేటా ప్రకారం కోవిడ్ 2 పాజిటివ్ రేటు 7.3 నుంచి 5% కి తగ్గినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఈ కొత్త వేరియంట్ వైరస్ నుJN-1, వేరేయంటుగా అలాగే..VOI గా వర్గీకరించారట. దీంతో ఇండియాలో కూడా కేసులు నమోదు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి కోవిడ్ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలుపుతున్నారు. ఈ ఏడాది నివేదికలు తెలిపిన ప్రకారం దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరిశీలించగా.. శ్వాస కోస సంబంధిత, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కేసులు పెరుగుతున్నాయట. అందుకే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: