పాక్ ప్రభుత్వం తన అధికారిక టీవీ ఛానల్ పీటీవీకి చెందిన 17 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎందుకో తెలుసా.. ఆ మధ్య పాక్‌ ప్రధాని లాహోర్ పర్యటనకు వీరు సరైన కవరేజీ ఇవ్వలేదట. పాక్ ప్రధాని పర్యటిస్తున్నా తగిన ఏర్పాట్లు చేసుకోలేదట. అందుకే ఇందుకు బాధ్యులైన  17 మంది ఉద్యోగులను పాకిస్థాన్ టెలివిజన్ సస్పెండ్ చేసింది.


అసలేమైందంటే.. ఏప్రిల్‌ 24న లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పత్‌ జైలు, రంజాన్‌ బజార్‌లను పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సందర్శించారు. అయితే దానిని పూర్తి స్థాయిలో కవరేజీ చేయలేదు. ప్రధాని పర్యటన దృశ్యాలను చేరవేసే అధునాతన ల్యాప్‌టాప్‌ అందుబాటులో లేదట. అందుకే అలా జరిగింది ఈ లోపాన్ని గుర్తించిన యాజమాన్యం 17మంది ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేస్తూ సస్పెండ్‌ చేసింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం ఓ టీమ్ ప్రధానమంత్రి కవరేజీ కోసం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: