తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో భాజపా గెలిచే ప్రసక్తే లేదంటున్నారు మంత్రి సత్యవతి రాథోడ్‌.. అంతే కాదు.. రాష్ట్రంలో భాజపా రెండో స్థానానికి చేరడం కూడా గొప్పేనంటూ వెటకారం ఆడారు సత్యవతి రాథోడ్.. అంతే కాదు.. ఒక ఆదివాసీ మహిళకు మంచి చేస్తే అందరికీ చేసినట్లు కాదని లా పాయింట్‌ లాగారు  మంత్రి సత్యవతి రాథోడ్‌.. ముర్ము రాష్ట్రపతి అయితే ఆదివాసీలకు ఒరిగేది ఏమీ లేదని మంత్రి సత్యవతి రాథోడ్‌ అంటున్నారు.


అది కూడా వాస్తవమే.. ఒక్క ముర్ము రాష్ట్రపతి అయినంత మాత్రాన గిరిజనుల బతుకులన్నీ మారిపోవుగా.. లాజిక్‌ ఓకే.. కానీ.. ఇదే లాజిక్ దళిత బంధుకు కూడా వర్తిస్తుంది కదా అంటున్నారు బీజేపీ నాయకులు.. కేసీఆర్‌ దళిత బంధు నియోజక వర్గానికి కేవలం 100మందికి ఇచ్చి దళితులను ఉద్దరిస్తున్నట్టు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో ఉన్న దళితులకు కేవలం వందల్లో మేలు చేస్తే దళితుల బతుకులు మారినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs