ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పేదలకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సాఫ్ట్‌వేర్ సవరణ వల్లే కొంత జాప్యం జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ వివరణ ఇచ్చారు. 2022 డిసెంబరు వరకూ కేంద్రం ఇచ్చిన 5 కిలోలకు అదనంగా రాష్ట్రం సొంతంగా నిధుల భారం భరించి అన్ని రేషన్ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా ఇచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి కేంద్రం నిర్ణయం ప్రకారం ఇవ్వడానికి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతికంగా సవరణలు వచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.


గతంలో పీఎంజీకేఏవై కింద కేంద్రం ఆలస్యంగా నిర్ణయం వెలువరించడం వల్ల 2021 మే నుంచి 2022 డిసెంబర్ వరకూ 20 నెలలకు ఒక్కో యూనిట్‌కు 200 కేజీలకు బదులు 203 కేజీలు అదనంగా ఇచ్చామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తద్వారా 2021 మే, 2022 మే, జూన్ మాసాల్లో రాష్ట్రం అదనంగా పంపిణీ చేసిన ఒక్కో కిలోని ఈ జనవరి నుంచి మార్చి వరకూ సర్ధుబాటు చేయడంతో 2023 మార్చి వరకూ ఒక్కో యూనిట్‌కు 5 కిలోలు, ఆ తర్వాత 2023 ఎప్రిల్ నుంచి యధావిధిగా 6 కిలోలు చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: