బాదం పప్పును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాదంలో ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఉప్పు లేకుండా నేచురల్ గా లేదా ఒరిజినల్ గా ఉన్నవి తిన్నా కూడా అవి రుచికరంగా ఉంటాయి. అందుకే ఇవి న్యూట్రీషియన్ స్నాక్స్ గా.. బోలెడు ఆరోగ్యప్రయోజనాలను అందించే పోషకహారంగా పాపులర్ అయ్యింది. అలాగే వాటి ద్వారా అందాన్ని పెంపొందించుకోవొచ్చు. అందులో ఉంటే ఏ,ఈ విటమిన్స్ చర్మంపై ఉండే దుమ్ముధూళిని మొత్తాన్ని తొలగిస్తుంది. అవెలాగో చూద్దాం..


- కొన్ని కాఫీ గింజలను బాగా పొడి చేసుకోండి. అందులో కాస్త బాదం పాలు కలుపుకుని దాన్నిముఖానికి రాసుకోండి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. దీని వల్ల కూడా మీ ఫేస్ అందంగా తయారవుతుంది.


- బాదం నూనెలో కాస్త ఆముదం వేసి పెదాలపై పూసుకుంటే లిప్స్ పింక్ కలర్ లోకి మారుతాయి. 


- బాదం నూనె కూడా ఫేస్ అందాన్ని పెంచగలదు. బాదంనూనె, కొబ్బరి నూనె కలుపుకుని ముఖంపై డ్రై గా ఉండే ప్రాంతంలో లేదంటే కాస్త నల్లగా ఉండే ప్రాంతంలో పూసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.


- రోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకోండి. కొన్ని రోజుల్లో మీ ముఖంలో కొత్త కాంతి కనపడుతుంది. 


- . బాదంపప్పును రాత్రంతా బాగా నానబెట్టి పొట్టును తీసివేయాలి. దాన్ని మిశ్రమంగా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కాస్త నిమ్మరసం కలపి ఫేస్ కు అప్లై చేయ‌డం వ‌ల్ల ముఖం గ్లో వ‌స్తుంది.


- బాదం, ఆముదం కలిపి జుట్టుకు పూసుకోండి. జుట్టు నిగనిగలాడుతుంది. రాలిపోదు, బలంగా ఉంటుంది. 


- కొందరు ఫేస్ పై, కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటాయి. అయితే కాస్త బాదం నూనెలో తేనె కలిసి నల్లటి వలయాలపై పూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


- బాదం పౌడర్‌ లో పాలను కలుపుకుని ఫేస్ కు పూసుకుంటే దురద సమస్య తగ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: