ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చలి కాలంలో మీరు అందంగా నిగ నిగ లాడిపోవాలంటే ఈ పద్ధతులు పాటించండి... చర్మం  పొడిబారకుండా కొద్దిపాటి ఆరెంజ్ రసంలో తేనె కలిపి చర్మానికి రాయండి.ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి ఫౌడర్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పేస్టులా చేసుకుని చర్మానికి రాసుకున్నా డ్రై స్కిన్ సమస్య నుంచి బయటపడవచ్చు.టమోటా గుజ్జు, పెరుగు మిశ్రమంతో కూడా చర్మం పొడిబారే సమస్య నుంచి బయపడొచ్చు. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.చర్మం పొడిగా ఉన్నప్పుడు కాకుండా, తేమగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

అప్పుడే సరైన ఫలితం కనిపిస్తుంది.గోరువెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగితే చర్మం అందంగా మెరస్తుంది. శరీరంలోని వ్యర్థాలు సైతం బయటకు పోతాయి.చలి వల్ల చాలామంది మరిగిన నీళ్లు చేస్తారు. అలా చేయడం చాలా తప్పు. దీని వల్ల చర్మం సహజ నూనెలకు నష్టం వాటిల్లుతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.

స్నానానికి ముందు కాస్త మొక్కజొన్న పిండి, పెరుగు కలిపి చర్మానికి రాసి కాసేపు ఆరనివ్వండి. ఆ తర్వాత స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా అందంగా కనిపిస్తుంది.చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుందనే కారణంతో చాలామంది నీళ్లు తాగరు. అలా చేస్తే బాడీ డీ-హైడ్రేట్‌కు గురవ్వుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువ తాగండి.ఆహారం ఎక్కువగా తీసుకోకుండా పండ్లు ఆకు కూరలను ఎక్కువగా తీసుకోండి.

చర్మం పొడిబారితే ఆల్కహాల్ కలిగిన బాడీ క్రీములు, లోషన్లు, టోనర్లు వాడకండి. అవి చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. ఆల్కహాల్ తక్కువ శాతం ఉండే లోషన్లు మాత్రమే వాడండి. కొబ్బరి నూనె మంచి బాడీ లోషన్ అనే సంగతి తెలిసిందే. కాబట్టి నీటిలో కాస్త కొబ్బరి నూనె వేసుకుని స్నానం చేయండి. చర్మం పొడిబారకుండా ఉంటుంది.కొబ్బరి నూనెలో కాస్త నిమ్మరసం కలిపి రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.ఇలాంటి మరెన్నో సౌందర్య టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....


మరింత సమాచారం తెలుసుకోండి: