తెలంగాణ‌లోని కాళేశ్వరం ప్రాజెక్టులో మ‌రో అపురూప ఘ‌ట్టం ఆవిష్కార‌మైంది. గోదావరి జ‌లాలు ప‌రుగులు పెడుతూ సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌కు చేరుకున్నాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి గోదావరిజలాలు రంగనాయకసాగర్‌లోకి వచ్చేశాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ శివారులో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగసాయక సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్‌ల వెట్‌రన్‌ను ప్రారంభించడంతో గోదావ‌రి జ‌లాలు సిద్దిపేట జిల్లాలో అడుగుపెట్టాయి. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టుతో సిద్ధిపేట నియోజకవర్గంలో సుమారు 71,516 ఎకరాలకు సాగునీరు అందనుంది.

 

రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మూడు టీఎంసీలు. అలాగే.. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని లక్షా 14వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ నేత‌, ఎంపీ సంతోష్‌కుమార్ వెట‌ర‌న్‌కు సంబంధించిన అద్భుత‌మైన వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని బీడుభూములను గోదావరి జలాలతో సాగులోకి తీసుకురావాల‌న్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశ‌యం నెర‌వేరింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తీ ఏక‌రాకు సాగునీరు అందించాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధ్యేయ‌మ‌ని ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: