దేశంలో కరోనా మహమ్మారి దాని ప్రతాపం రోజు రోజుకీ  బీభత్సంగా చూపిస్తుంది.  దేశంలో ఎక్కువగా  మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 597 కొత్త కేసులు నమోదు కాగా 32 మంది మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. చనిపోయిన వారిలో ముంబై నుంచే 26 మంది ఉన్నట్లు పేర్కొంది.  మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,915కి చేరింది. ఒక్కరోజే 597 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.  కరోనా నుంచి కోలుకున్న 205 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

ఇప్పటివరకూ మహారాష్ట్రలో 1593 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 432 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో కరోనా మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలోని థానే జిల్లాలో 20 రోజుల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. థానే జిల్లాలోని కల్యాన్‌ దాంబివ్లీ మున్సిపల్‌ పరిధిలో 20 రోజుల బాలుడితోసహా ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మున్సిపాలిటీ ఆరోగ్య అధికారి డా. రాజు తెలిపారు. ఇదిలా ఉంటే మహరాష్ట్రలో ముంబాయిలో కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుందని ప్రజలు భయాంతోళన వ్యక్తం చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: