దేశంలో కరోనా రక్కసి విలయం కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1823 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 33,610కి చేరింది.  అయితే కరోనా వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్న రాష్ట్రాల్లో మహరాష్ట్ర ఒకటి.. ఇక్కడ రోజు రోజుకీ కరోనా మరణాలు, కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 24,162గా నమోదైంది. 8,373 మంది డిశ్చార్జి అయ్యారు. 24 గంటల వ్యవధిలో 67 మంది మృత్యువాత పడగా, మొత్తం మరణాల సంఖ్య 1075కి పెరిగింది.

 

గడచిన 24 గంటల్లో 576 మంది డిశ్చార్జి కావడం కాస్తంత ఊరట కలిగించే విషయం. ఇదిలా ఉంటే..  బాంద్రా, పరేల్, దక్షిణ ముంబైలోని గురునానక్, కేఈఎం, బాంబే హాస్పిటళ్లకు తరలించినట్టు చెప్పారు. కరోనా బారినపడిన కానిస్టేబుళ్లు అందరూ 50 ఏళ్లు పైబడినవారేనని, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్ చేశామని తెలిపారు. వడాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు రెడ్‌జోన్లతోపాటు నాలుగు మురికివాడలు కూడా ఉన్నాయి.

 

ఈ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం ద్వారానే పోలీసులకు వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు.  అయితే రెడ్‌జోన్ పరిధిలోని ప్రజలకు పోలీసులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని, ఈ సందర్భంగా కరోనా బాధితుడి నుంచి వారికి వైరస్ సోకి వుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: