క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ నేప‌థ్యంలో కొన్ని ప్రాంతాల్లో గృహ‌హింస కేసులు పెరిగిపోతున్నాయి. ఛ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలో గ‌‌త మూడు నెల‌ల్లో చాలా కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు1500 మంది బాధితుల‌ను గుర్తించామ‌ని గృహ‌హింస కేసుల‌కు ప‌రిష్క‌రించేందుకు చుప్పీ టోడ్ (నిశ్శ‌బ్దాన్ని చేధించండి) క్యాంపెయిన్ ను ప్రారంభించిన‌ట్లు రాయ్ పూర్ ఎస్ఎస్పీ అరిఫ్ షేఖ్ తెలిపారు. ప్ర‌తీ రోజు‌ 50 మంది బాధితుల‌కు ఫోన్ చేసి..స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు.

 

అయితే.. గ‌త 4 రోజుల్లో 150కి పైగా ఫిర్యాదులు వ‌చ్చాయని... 10 నుంచి 15 మంది పురుషులు వాళ్ల భార్య‌ల‌పై ఫిర్యాదులు చేశార‌ని అరిఫ్ షేఖ్  వెల్ల‌డించారు. లాక్‌డౌన్ కార‌ణంగా అంద‌రూ ఇళ్ల‌లో ఉండ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని, ఏదో ఒక విష‌యంలో బేధాభిప్రాయాలు వ‌చ్చి గృహ‌హింస కేసులు పెరుగుతున్న‌ట్లు ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే.. ఇదే స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌కార‌ణంగా హ‌త్య‌లు, దోపిడీలు, దొంగ‌త‌నాలు త‌గ్గాయ‌ని ఇటీవ‌ల వెల్ల‌డైన గ‌ణాంకాలు చెబుతున్నాయి.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: