దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కేరళలో మాత్రం నెమ్మదిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు కేసులు ఓ రోజు పెరుగుతూ వచ్చింది. అయితే అక్కడ తీసుకున్న కఠిన మైన లాక్ డౌన్ చర్యలు కరోనా మెల్లి మెల్లిగా తగ్గుముఖం పట్టింది. ఆస్పత్రుల నుంచి రోజుకు కొందరు డిశ్చార్జ్ అవుతుండటంతో కేరళ సర్కార్‌ ఊపిరి పీల్చుకుంటుంది.   కేరళకు మరోసారి రిలీఫ్. రాష్ట్రంలో బుధవారం (మే 6) కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఈ రోజు కూడా  కొత్త కేసుల సంఖ్య సున్నా కావడం అక్కడి ప్రభుత్వ, అధికార యంత్రాంగం దృఢ సంకల్పానికి నిదర్శనం. కేరళలో ఇప్పటివరకు 500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు.

 

అయితే, కేంద్రం విదేశాల నుంచి భారతీయులను తీసుకువస్తున్న క్రమంలో, కేరళీయులు కూడా స్వరాష్ట్రానికి రానున్నారు. వారికి కూడా కచ్చితమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, రాష్ట్రాన్ని కరోనా రహితంగా తీర్చిదిద్దాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. కేరళలో వరసగా రెండు రోజుల పాటు ‘0’ కరోనా కేసులు  కావడంతో అక్కడ నూతనోత్సాహం మొదలైంది. కేరళలో మొత్తం 21,342 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో 21,034 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న కేరళ వాసులను 14 రోజుల హోంక్వారంటైన్‌లో ఉంచుతున్నారు.

 

కేరళలో కరోనా కారణంగా నాలుగు నెలల ఓ పసికందు సహా ముగ్గురు మరణించారు. భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైన విషయం తెలిసిందే. వుహాన్ నుంచి తిరిగొచ్చిన ఓ యువతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత ఆమె కోలుకుంది. ప్రజలకు లాక్ డౌన్ పద్దతి ప్రకారం పాటించడం వల్ల ఇంత గొప్ప రిజల్ట్ సాధించగలిగామని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: