దేశ ఆర్ధిక వ్యవస్థకు చాలా కీలకమైన అసంఘటిత రంగాన్ని కేంద్ర ప్రభుత్వం గాడిలో పెట్టినట్టేనా...? మోడీ ప్రకటించిన 20 లక్షల కొట్లలో ఈ రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారు. నిన్న మూడు లక్షల కోట్లను అసంఘటిత రంగానికే కేంద్రం ప్రకటించింది. నేడు కూడా ఆ రంగానికే ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 

 

వలస కార్మికులకు రైతులకు, వీధి చిరు వ్యాపారులకు భారీగా నిధులు కేటాయించింది. ఇప్పుడు బ్యాంకు లు గనుక జాలి తలిస్తే మాత్రం వీరికి కేంద్రం ప్రకటించిన నిధులు అందే అవకాశం ఉంటుంది. వలస కార్మికుల పునరావాసం కోసం 11 వేల కోట్లు, వారి ఉపాధి కోసం 10 వేల కోట్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. దీనితో గాడిన పడినట్టే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: