ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం తో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. తాజాగా తాడేపల్లి లోని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటున్న నివాసానికి సమీపంలో ఉన్న ఓ కాలనిలో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమైయ్యారు. తాడేపల్లి లోని ఎన్టీఆర్ కట్ట క్రిస్టియన్ పేటలో ఈ రోజు నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

 


అయితే ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండడం ప్రజల్లో భయాందోళనకు గురి అవుతున్నారు. అయితే వీరు ఇరువురు ప్రభుత్వ కార్యక్రమాలైన పింఛను పంపిణి కార్యక్రమం లో రెండు మూడు రోజుల క్రితం పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వీరు తిరిగిన మరియు కాంటాక్ట్ చేసిన వారెవరు అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కట్ట క్రిస్టియన్ పేట కాలనీ ప్రాంతనంతటిని అధికారులు దిగ్బంధంలో ఉంచారు. అదేవిధంగా ఆ ఏరియా మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

 

 

 

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 3373 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2273 కేసులు కోలుకొని డీఛార్జి అయ్యాయి. ప్రస్తుతం 1033 పాజిటివ్ కేసులు క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 71 మంది మరణించారు. ఆంధ్ర ప్రదేశ్లో లో ఇప్పటివరకు నమోదైన 3373 కేసులలో ...విదేశాల నుంచి వచ్చిన వారిలో 119 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. అందులో నలుగురు కోలుకున్నారు మిగతావారు చికిత్స పొందుతున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 616 వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 372 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు మిగిలిన వారు క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: