రైల్వే శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వేల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. రైల్వే శాఖ పాసింజర్ రైళ్లను సంఖ్యను భారీగా తగ్గించాలని లేదా ఎక్స్ ప్రెస్ రైళ్లను మాత్రమే నడపాలని యోచిస్తోంది. రైల్వే శాఖ అతి త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రైల్వే ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గిపొయే అవకాశాలు ఉన్నాయి. 
 
రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే చిన్న పట్టణాలు, గ్రామాలవారీగా ఉండే స్టాప్‌లు ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పాసింజర్ రైళ్లు రద్దు కానున్నాయని 200 కిలోమీటర్లు దాటిన పాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రైల్వే శాఖ నుంచి అతి త్వరలో ఈ నిర్ణయాల గురించి స్పష్టత రానుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: