ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ దేశంలో నానాటికీ పెరుగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ చెప్పిన‌ట్టు దేశంలో ప్ర‌జ‌లు క‌రోనా విష‌యంలో నిర్ల‌క్ష్యంతో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే రోజు రోజుకు ఇక్క‌డ రికార్డు స్తాయిలో కేసులు న‌మోదు అవుతున్నాయి. చివ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రి తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారంటే ప‌రిస్థితి ఏ రేంజ్‌కు వెళ్లిపోతుందో అర్థం చేసుకోవ‌చ్చు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,653 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ బారినపడి 507 మంది మృతి చెందారు. 

 

మ‌న దేశంలో కేర‌ళ‌లో తొలి క‌రోనా కేసు బ‌య‌ట ప‌డిన‌ప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు ఒకే రోజు ఇన్ని మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం ఇదే తొలిసారి. ఇక తాజా లెక్క‌ల ప్ర‌కారం చూస్తే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,85,493కి చేరగా.. మరణాల సంఖ్య 17,400కి పెరిగింది. ప్రస్తుతం​ 2,20,114 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,47,979 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 86 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: