కేంద్ర ఆరోగ్య శాఖ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్స్​ (ఎయిమ్స్​) నర్సులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మందికిపైగా సిబ్బంది.. నిరసనబాట పట్టనున్నారు. నర్సుల హామీలను నెరవేరుస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో మాటిచ్చినా.. ఇంతవరకూ వాటిని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు నర్సు యూనియన్​ అధ్యక్షుడు హరీశ్​ కుమార్​ కజ్లా.


తమ డిమాండ్ల పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినా.. అవి ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు నర్సులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారిందని వారు వాపోయారు. ఓవైపు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్​ బాధితులకు సేవ చేస్తుంటే.. కేంద్రం మాత్రం తమపట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: