ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ. లద్దాఖ్​లోని భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని పేర్కొనటం ద్వారా సైనికులను ప్రధాని అవమానించారని ఆరోపించారు. చైనా సైనికులను భారత భూభాగం నుంచి ఎప్పుడు పంపిస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు.బిహార్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిసువాలో నిర్వహించిన తొలి ర్యాలీలో ఈ మేరకు విమర్శలు చేశారు రాహుల్​.


కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్​ గాంధీ. ఇతర రాష్ట్రాలలో పని లేక బిహార్​ కార్మికులు వస్తే.. వారికి మోదీ ఏమీ చేయలేదని ఆరోపించారు. వారి ముందు మోకరిల్లటం తప్ప.. అవసరమైన సాయమేమీ అందించలేదన్నారు. బిహారీలకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ఎప్పుడు ఇచ్చారో తెలపాలని డిమాండ్​ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: