ప్ర‌పంచ‌క‌ప్ 20 క్రికెట్‌కు భార‌త్ ఆధిత్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో అస‌లు టోర్న‌మెంట్ ఉంటుందా ?  లేదా ? అన్న సందేహాలు ముసురు కున్నాయి. ఒకవేళ టి20 ప్రపంచకప్‌ నాటికి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనకపోతే... 9 వేదికల మ‌ధ్య టోర్నీలో పాల్గొనే 16 జ‌ట్లు ప్ర‌యాణించేందుకు క‌ష్టంగా ఉంటుంది. అప్పుడు ఈ ఇబ్బంది లేకుండా కేవ‌లం నాలుగు వేదిక‌ల మీదే టోర్న‌మెంట్ నిర్వ‌హించేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను త్వరలోనే ఐసీసీకి నివేదించనుంది. ఏదేమైనా టోర్న‌మెంట్ మాత్రం ఆగ‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: