దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజు మళ్లీ పెరిగాయి. ఎంతసేపూ పెరగడమే కానీ తగ్గిన సందర్భాలు కనిపించట్లేదు. సగటు జీవి జీతమంతా పెట్రోలు, డీజిల్‌కే అయిపోతోంది. చమురు కంపెనీలు ఇష్టా రాజ్యంగా ధరలు వడ్డించేస్తున్నాయి. అసలే కరోనా వల్ల నానా తిప్పలు పడుతున్న దేశ ప్రజలను చమురు కంపెనీలు మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వరుసగా మూడో రోజు బుధవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెంచాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.92.05, డీజిల్‌ రూ.82.61కు చేరింది. దేశ రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.98.36, డీజిల్‌ రూ.89.75, చెన్నైలో రూ.93.84, డీజిల్‌ రూ.87.49, కోల్‌కతాలో రూ.92.16, డీజిల్‌ రూ.87.45, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.95.67, డీజిల్‌ రూ.90.06, రాజస్థాన్‌ జైపూర్‌లో పెట్రోల్‌ రూ.99.31, డీజిల్‌ రూ.91.98, భోపాల్‌లో పెట్రోల్‌ రూ.100.08, డీజిల్‌ రూ.90.05కు చేరాయి. తాజా పెరు‌గు‌ద‌లతో దేశ‌వ్యా‌ప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు గరి‌ష్ఠా‌నికి చేరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: