గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త ప్రముఖ హాలివుడ్ గాయకుడు నిక్ జోనాస్ కు ప్రమాదం జరిగింది. లాస్‌ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్‌’ షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్‌కు స్వల్ప గాయాలయాయ్యి. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు పెద్దవేమి కాకపోవడంతో డాక్టర్స్ చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమవారం నిక్ తన రియాలిటీ షో ది వాయిస్ లో పాల్గొననున్నాడు. కాగా 2018లో ప్రియాంక, ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక తన ప్రాజెక్ట్స్‌ కోసం లండన్‌, నిక్‌ జోనస్‌ లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: