కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న 44వ జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంది.క‌రోనా ఔష‌దాలు, కొన్ని వైద్య ప‌రికరాలపై ప‌న్నులు త‌గ్గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.అంబులెన్స్‌ సేవలపై 28శాతం జీఎస్టీ నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నామని...టోసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్ బి ఔషధాలపై పన్ను మినహాయింపు ఇస్తున్న‌ట్లు ఆమె తెలిపారు.రెమ్‌డెసివిర్ ఔషధంపై జీఎస్టీ 12% నుంచి 5% శాతానికి తగ్గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.ఇటు ఆక్సిజన్‌ యూనిట్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాలు, వెంటిలేటర్లు, ఇతర సంబంధిత పరికారాలపై జిఎస్టీ 12% నుంచి 5% జీఎస్టీ తగ్గింస్తున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీతార‌మ‌న్ తెలిపారు.కోవిడ్ టెస్ట్ కిట్లు, యంత్రాలపై జిఎస్టీ 5%శాతానికి త‌గ్గించామ‌ని...వ్యాక్సిన్లపై 5% జిఎస్టీ మాత్రం కొనసాగుతుంద‌న్నారు.ఉష్ణోగ్రతలు లెక్కించే పరికరాలు, శానిటైజర్లపై జిఎస్టీ 18% నుంచి 5% శాతానికి తగ్గించామ‌ని...ఈ జీఎస్టీ తగ్గింపులు, మినహాయింపులు  సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: