ఇంగ్లాండ్ లో భార‌త సంత‌తికి చెందిన యువ‌తికి అరుదైన గుర్తింపు ల‌భించింది. శానిటరిప్యాడ్లను కొనుక్కోలేక బడి మానేస్తున్న అమ్మాయిల కోసం భార‌త సంత‌తికి చెందిన అమికా జియార్జ్ అనే యువ‌తి ఇంగ్లాండ్ లో ఫ్రీ పీరియ‌డ్స్ అనే కాంపెయిన్ ను న‌డిపింది. ఆమె చేసిన కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌భుత్వ‌మే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశంలోని పేద విద్యార్థినులంద‌రికీ ఉచితంగా పీరియడ్ ప్రొడక్ట్స్ ను పంపిణీ చేయ‌డం ప్రారంభించింది. అయితే తాజాగా భారత సంతతి యువతి అమికా జియార్జ్ కృషి వ‌ల్లే దేశంలో శానిట‌రి ప్యాడ్ల‌ను పంపిణీ చేస్తున్నందున ఆమెకు అరుదైన గుర్తింపు ద‌క్కింది. 'మెంబెర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' అవార్డుతో అమికాను ప్ర‌భుత్వం స‌త్క‌రించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: