విజ‌య‌వాడ ఈఎస్ఐ డైరెక్ట‌రేట్‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై రెండురోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలంటూ డైరెక్ట‌ర్‌ను కార్మిక‌శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ఆదేశించారు. మందుల ల‌భ్య‌త‌పై త‌క్ష‌ణ‌మే దృష్టిసారించాలంటూ అధికారుల‌కు సూచించారు.  కొటేష‌న్ లేకుండా మాస్క్‌లు, శానిటైజ‌ర్లు నేరుగా సూప‌ర్‌బ‌జార్ నుంచి కొనుగోలు చేసినవారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్లు రావ‌డంతో మంత్రి ఈ స‌మావేశం నిర్వ‌హించారు. కార్మిక‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనంత‌రాములు, క‌మిష‌న‌ర్ రేఖారాణితో సమీక్ష నిర్వ‌హించి లేబ‌ర్ సెస్ క‌లెక్ష‌న్‌కు సంబంధించి పూర్తివివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవ‌లే గుంటూరు వ్య‌వ‌సాయ క్షేత్రంలో జ‌రిగిన బాయిల‌ర్ ప్ర‌మాదంపై మంత్రి ఆరా తీశారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా బాయిల‌ర్ల‌పై ప్ర‌త్యేక త‌నిఖీలు నిర్వ‌హించాల‌న్నారు.పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి గారు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag