విజ‌య‌వాడ‌లోని సిద్ధార్థ మెడిక‌ల్ కాలేజీలో ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను దేవాదాయ‌శాఖ‌మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ ప్లాంట్‌ని సిద్ధార్థ మెడిక‌ల్ కాలేజీ పూర్వ విద్యార్థులు త‌మ సొంత ఖ‌ర్చుల‌తో ఏర్పాటు చేశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సిదార్థ కాలేజీ పూర్వ విద్యార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున ధ‌న్య‌వాదాలు తెలిపారు. కృష్ణాజిల్లాలో అన్ని ఆసుప‌త్రుల్లో 11వేల‌కుపైగా ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ అందించేలా ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు.కేంద్రం అర‌కొర‌గా సౌక‌ర్యాలు కల్పించింద‌ని..ఎవ‌రి మీద ఆధార‌ప‌డ‌కుండా ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు.కృష్ణాజిల్లా క‌లెక్ట‌ర్ జె నివాస్ మాట్లాడుతూ...ప‌రిశ్ర‌మ‌ల స‌హ‌కారంతో ఆక్సిజ‌న్‌ని అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు.రాంకో,కేసీపీ సిమెంట్ కంపెనీలు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో దోహ‌ద‌ప‌డ్డాయ‌న్నారు.సిద్ధార్థ మెడిక‌ల్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఈ ప్లాంట్‌ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.జీవో 57 ప్ర‌కారం 50 ప‌డ‌క‌లపైన ఉన్న ప్ర‌తి ప్ర‌వేట్ ఆసుప‌త్రికి పీఎస్ఐ ప్లాంట్ ఉండాల‌ని...జిల్లాలోనే ఇది మొద‌టి పీఎస్ఐ ప్లాంట్ అని క‌లెక్ట‌ర్ జె నివాస్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

smc