ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ మధ్య ఒక రకమైన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని ఐటీ చట్టాలను ట్విట్టర్ సంస్థ అంగీకరించని కారణంగా ప్రస్తుతానికి ఉన్న మధ్యవర్తి హోదాను కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద అంశాలను ట్విట్టర్ యూజర్ కనుక పోస్ట్ చేస్తే సదరు యూజర్ తో పాటు ట్విట్టర్ సంస్థ మీద కూడా పోలీసులు కేసులు పెట్టే అవకాశం లభించింది.. 


అసలు దీనంతటికీ కారణం రాహుల్ గాంధీకి మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్ పనిచేస్తుందని బిజెపి భావిస్తూ ఉండటమే. ఒకరకంగా ఇంత వివాదం జరుగుతున్న ప్రధానమంత్రి సహా మిగతా కేంద్ర మంత్రులు కూడా ట్విట్టర్ వాడుతూనే ఉన్నారు. ఒకపక్క ట్విట్టర్ కుట్ర చేస్తోందని ఆరోపిస్తూనే మరోపక్క ట్విట్టర్ ఖాతాలు యధాతథంగా వాడటం వెనుక మర్మం ఏమిటో తెలియడం లేదు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ట్విట్టర్ వద్దంటూనే వారు ముద్దు చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: