శ్రీలంక పర్యటలో ఉన్న టీమిండియా ప్లేయర్ కు కరోనా వైరస్ సోకింది. లంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ బీసీసీఐ వాయిదా వేసింది. రేపు మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఆటగాళ్లు అందరికీ నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లో కీలక ప్లేయర్ కృనాల్ పాండ్యాకు కోవిడ్ -19 పాజిటివ్ గా తేలింది. మరో ఎనిమిది మంది ప్లేయర్స్ కృనాల్ పాండ్యాకు సన్నిహితంగా మెలిగినట్లు బీసీసీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో రెండో టీ20 మ్యాచ్ ను బీసీసీఐ వాయిదా వేసింది. అసలు బయోబబుల్ లో ఉన్న ప్లేయర్ కు వైరస్ ఎలా సొకిందనే విషయంపై బీసీసీఐ విచారణ జరిపిస్తోంది. కృనాల్ పాండ్యాను ఐసోలేషన్ ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. మూడు టీ20ల సిరీస్ లో కూడా తొలి మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ టూర్ లో కృనాల్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: