పెగాసస్ స్పైవేర్ గురించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంకుఠిత దీక్ష లో పనిచేస్తున్నారు. ఆమె దేశంలోనే మొట్టమొదటి విచారణ కమిటీని ఏర్పాటు చేసి, ఈ విషయంపై ఢిల్లీ కి వెళ్లి అధికార మరియు ప్రతిపక్ష నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒక సంచలన విషయం బయటపెట్టారు. ఆమె ఫోన్ ఇప్పటికే ట్యాప్ అయ్యిందని, తాను ఎవరితో అయినా మాట్లాడితే వారి ఫోన్ లో పెగాసస్ స్పైవేర్ హ్యాక్ జరిగినట్లయితే తన ఫోన్ కూడా ఆటోమేటిక్ గా ట్యాప్ అవుతుంది అని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో తెలిపారు. ఇక దేశం మొత్తం ఈ పరిస్థితిని చూస్తోందని ఇది అత్యవసరం సమయం అని ఒకవేళ గనుక సార్వత్రిక ఎన్నికలు(2024 వచ్చినట్లయితే దేశం మొత్తం ఒకవైపు మరియు ప్రధాని మోడీ మాత్రమే మరొకవైపు ఉంటారని మమతా స్పష్టం చేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: