ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ... చంద్రబాబు నిర్వాకం వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయన్నారు. 2015 లోనే చంద్రబాబు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచారని ఆరోపించారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పై టిడిపి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చంద్రబాబు హయాంలో కరోనా పరిస్థితి లేదని... టీడీపీ హయాంలో ఉన్నపుడు రోడ్డు మరమ్మతులు పట్టించుకోలేదని, అడ్డంగా దోచుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. అమర రాజా కంపెనీ విషపూరితమైన కాలుష్యం వెదజల్లుతోంది అని సజ్జల రామకృష్ణ ఆరోపించారు.

ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ముఖ్యం అని ఆయన తెలిపారు. హైకోర్టు కూడా అమర్ రాజా కంపెనీని హెచ్చరించిందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై టిడిపి  ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తుందని సజ్జల పేర్కొన్నారు. ఏపీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉందని చంద్రబాబు చేసిన అప్పు ల కారణంగానే ఆర్థిక భారం ఏర్పడిందన్నారు. చంద్రబాబు కు తోడు కరోనా పరిస్థితులు తోడయ్యాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వద్దని చెబుతున్నారా అంటూ ప్రశ్నించారు. కేంద్రం అప్పులు చేస్తున్న విషయం రాష్ట్ర బిజెపి నేతలకు తెలియదా అని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: