విజయనగరం జిల్లాకు బొబ్బిలి రాజులు మరోసారి ఎలాంటి తలనొప్పులు పెట్టుకునేందుకు సిద్ధంగా లేరు. ఇప్పటికే విజయనగరం గజపతి రాజుల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. వీరి విషయంలో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బొబ్బిలి రాజులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో బంగారం, వెండి నగలు మాయమయ్యా అంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అసలు ఎందుకా తలనొప్పి  అనుకున్నారో ఏమో. వేణుగోపాల స్వామి గుడిలో బంగారం, వెండి నగల లెక్కింపును పూర్తి చేశారు అధికారులు. అనువంశిక ధర్మకర్త సమక్షంలో రెండు రోజుల పాటు లెక్కించారు. ఆభరణాల లెక్కలు పూర్తిగా సరిపోయాయని మాజీ మంత్రి, బొబ్బిలి రాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుజయ్ కృష్ణ రంగారావు వెల్లడించారు. ఆ తర్వాత వీటి భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్నారు. నగలను కోటలో భద్రపరిస్తే... తమపై దుష్ప్రాచారం జరుగుతోందని... ఇకపై నగల భద్రత బాధ్యత మాత్రం తాము తీసుకోమన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాస్తామని వెల్లడించారు. తమ పూర్వీకులు ఆలయ అభివృద్ధికి ఇచ్చిన 4 వేల ఎకరాల భూముల లెక్కలు కూడా తేల్చాలని సుజయ్ కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: