చిత్తూరు జిల్లాలో ఇటీవ‌ల దొంగ‌త‌నం కేసులో ఓ ఏఎస్సై తో పాటు, కానిస్టేబుల్ అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే వారిలో ఏఎస్సై మ‌హ‌మ్మ‌ద్ ఈరోజు గుండెపోటుతో మ‌ర‌ణించాడు. ఏస్సై మ‌హ‌మ్మ‌ద్ ఏఎస్సైగా చిత్తూరు జిల్లాలో విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన మ‌హ‌మ్మ‌ద్ తో పాటు మ‌రో కానిస్టేబుల్ రోడ్డు సైడ్ ఉన్న ఓ బ‌ట్ట‌ల దుకాణంలో దొంగ‌త‌నం చేశారు. వ్యాపారి త‌న బ‌ట్ట‌లు మాయం అవుతుండ‌టంతో అక్క‌డ సీసీ కెమెరాను అమ‌ర్చాడు. 

అయితే మ‌రుస‌టి వ‌చ్చి చూసే స‌రికి బ‌ట్ట‌ల మూట‌లో తేడా క‌నిపించ‌డంతో ఆ సీసీ టీవీ పుటేజి తీసుకుని పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ పుట‌జీలో కానిస్టేబుల్ యూనిఫాం తో ఉండ‌గా ఏ ఎస్సై మ‌హ‌మ్మ‌ద్ సివిల్ డ్రెస్ లో ఉన్నారు. ఇక ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేయ‌గా ప్ర‌స్తుంతం ఏ ఎస్సై మ‌హ‌మ్మ‌ద్ రిమాండ్ ఖైదీగా ఉండ‌గా బుధ‌వారం గుండెపోటు రావ‌డంతో పోలీసులు ఆస్పత్రికి త‌ర‌లిచారు. చికిత్స పొందుతూ మ‌హ‌మ్మ‌ద్ మృతి చెందాడని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: