ఏడు నెలల తర్వాత భారత్, కువైత్ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తాజాగా మరో రెండు కొత్త  విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు భార‌త్‌, కువైత్‌కు   చెందిన విమానయాన సంస్థలు ప్రకటించాయి. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ(ఎస్‌వీపీఐ) విమానాశ్రయం నుంచి ఈ సర్వీసులు ఉంటాయి. ఎయిర్ ఇండియా, కువైత్ ఎయిర్‌లైన్స్ వీటిని నడపనున్నాయి.
అలాగే లండన్‌కు కూడా విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇరుదేశాల మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఈ సర్వీసు నడిపిస్తున్నట్లు ఎస్‌వీపీఐ ప్ర‌క‌టించింది. కాగా, అంతర్జాతీయ ప్రయాణాలు మొదలైన తర్వాత మొట్టమొదట ఈ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్‌కు తొలి విమానం నడిపించారు. ఇదే మార్గంలో ఇటీవల అదనంగా మరో సర్వీసును కూడా నడిపిస్తున్నట్లు ఎస్‌వీపీఐ యాజమాన్యం ప్ర‌క‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: