భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ రానురాను బాగా పెరిగిపోతున్నాయి. ప్రారంభం కాస్త ఆలస్యం అయినప్పటికీ భారతీయులు దీనికి త్వరగా అలవాటు పడ్డారు. కరోనా నేపథ్యంలో ఇది బాగా కలిసి వచ్చింది. ఎక్కడికి వెళ్లలేని స్థితిలో చేతిలో స్మార్ట్ మొబైల్ తో అన్ని పేమెంట్స్ చేసేసుకున్నారు ప్రజలు. ఒకప్పుడు ఏదైనా పేమెంట్ చేయాలంటే బ్యాంకుల వద్ద క్యూ కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అన్ని రకాల పేమెంట్స్ కూడా డిజిటల్ విధానంలో చేసుకుంటున్నారు అందరు. అయితే దీనికి కనీస నెట్ డేటా అవసరం. ఆ సదుపాయం లేకుండా ఈ డిజిటల్ యాప్ లు వాడటం కుదరని పని. అందుకే దేశంలో నెట్ లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేసుకునేట్టు ఆఫ్ లైన్ విధానాన్ని తేవాలని యోచిస్తుంది ప్రభుతం.

దానిలో భాగంగానే దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఆఫ్ లైన్ విధానంలో జరిపేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. దీనిని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తన మాటలలో తెలిపారు. ప్రస్తుతం చాలా ప్రాంతాలలో నెట్ అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ప్రాంతాలలో వారు కూడా సులువుగా పేమెంట్స్ చేసుకునే విదంగా డిజిటల్ విధానంలో సరికొత్త మార్పులు తెస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనికోసం ద్రవ్య పరపతి కమిటీ(ఎంపీసీ) సమావేశం అయ్యింది. అనంతరం దాస్ మీడియాతో ఈ విషయాలు పంచుకున్నారు. దేశంలో చాలా మారుమూల ప్రాంతాలకు నెట్ అందుబాటులో లేదని, అలాంటి ప్రాంతాలలో ఉన్నవారు కూడా డిజిటల్ విధానం వాడుకునే విధంగా దానిలో మార్పులు తెస్తున్నట్టు ఆయన తెలిపారు.  

ఈ విధానం ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద గత సంవత్సరం ఆగష్టు లోనే ప్రకటించబడిందని దాస్ తెలిపారు. అది విజయవంతం కావడంతో ఇక మీదట దేశవ్యాప్తంగా రిటైల్ దుకాణాలలో ఈ తరహా ఆఫ్ లైన్ డిజిటల్ పెమెట్స్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి తేనున్నారు. దీనిద్వారా ఎక్కువ మంది డిజిటల్ విధానంలోకి అలవాటు పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీని వలన వ్యక్తులకు, వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. ఈ విధానంలో తాజాగా పరిగణలోకి తీసుకున్న సమాచారం ప్రకారం, 2.41 లక్షల లావాదేవీలు జరిపామని, దాని ద్వారా 1.16 కోట్ల చెల్లింపులు జరిగాయని ఆయన తెలిపారు. అతి త్వరలో అందరికి ఈ విధానం అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: