ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మీల్ మేకర్.. సాయంత్రం వేళల్లో మనం మసాలలో తింటాము. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. మీల్ మేకర్ తో మీల్ మేకర్ మసాలా తయారు చేసుకుంటాము. అలాగే ఈ మీల్ మేకర్ పలావ్ లో కాని బిర్యానీలో కాని తినటానికి చాలా బాగుంటుంది. ఇక మీల్ మేకర్ తో రుచికరమైన పకోడాలు కూడా తయారు చేసుకోని తినవచ్చు. ఇక ఆ రుచికరమైన మీల్ మేకర్ పకోడాని ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. ఇంకా మీరు ఇంట్లో ట్రై చెయ్యండి....


మీల్ మేకర్ పకోడా కి కావలసిన పదార్ధాలు.....


మీల్‌మేకర్‌ – 1 కప్పు(పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి),
బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున,
శనగపిండి – పావు కప్పు+3 టేబుల్‌ స్పూన్లు,
ఉల్లిపాయ తరుగు – పావు కప్పు,
పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు,
కారం – 1 టీ స్పూన్‌,
పసుపు – చిటికెడు,
నిమ్మరసం – 2 టీ స్పూన్లు,
అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌,
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా,
ఉప్పు – తగినంత,
నీళ్లు – సరిపడా....


మీల్ మేకర్ పకోడా తయారు చేసే విధానం....


ముందుగా ఒక బౌల్‌ తీసుకుని, అందులో మీల్‌ మేకర్‌ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్‌ కారం, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకుని సరిపడా నీళ్లతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్‌లో శనగపిండి, అర టీ స్పూన్‌ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలుచగా కలుపుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని ముంచి కాగుతున్న నూనెలో పకోడాలను దోరగా వేయిస్తే రుచి అదిరిపోతుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: