క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచ‌మంతా లాక్‌డౌన్ బాట‌లో ప‌య‌నిస్తుంటే స్వీడ‌న్ మాత్రం తలుపులు బార్లా తెరిచేసింది. అయితే దేశంలో వైరస్‌ ఆనవాళ్లు కనిపించిన ఆరంభం నుంచే ప్రజల్ని చైతన్యపరిచి.. కట్టడి చేయాల్సిన బాధ్యతను వారికి సైతం అప్పగించ‌డం ఈ దేశం ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకోవాలి. క‌ఠిన ఆంక్ష‌ల స్థానంలో చైత‌న్యానికే ముందు ప్రాధాన్యం ఇవ్వ‌డం స్వీడ‌న్ పాల‌కుల ఘ‌న‌త‌గానే చెప్పుకోవాలి. దీంతో ఇక్క‌డ ఎలాంటి నిర్బంధాలు లేవు. ప్రజారవాణా నిరాటంకంగా నడుస్తోంది. అయితే యువత అధికంగా ఉండే కళాశాలలను మాత్రం మూసేశారు. చిన్నపిల్లలు మాత్రం పాఠశాలలకు వెళ్తుండ‌టం గ‌మ‌నార్హం. 


అయితే స్వీడ‌న్ అనుస‌రిస్తున్న స్వేచ్ఛా విధానం..స్వీయ నిర్బంధం అనే విధానాల‌పై ప్ర‌పంచ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యాన్ని అక్క‌డి పాల‌కుల‌కు సూచించ‌గా మా వ్యూహాలు మాకున్నాయని ధీమాగా  చెబుతుండ‌టం విశేషం. స్వీడ‌న్ మొద‌టి నుంచి జీవ‌న శైలిలోనూ, ఆర్థిక‌, ఆరోగ్య ప‌ర‌మైన అంశాల్లోనూ ఇతర ఐరోపా దేశాలకు భిన్నంగా ఉంటూ వ‌స్తోంది. క‌రోనా ఆరంభం నుంచి  స్వీడన్‌లో చాలావరకు స్వచ్ఛంద కట్టడి చర్యలే కొన‌సాగుతున్నాయి. అయితే లాక్‌డౌన్‌ విధించకపోయినా అక్క‌డి ప్ర‌జ‌లు అవ‌స‌ర‌ముంటే త‌ప్పా రోడ్ల‌పైకి రావ‌డం లేదు. ఇది ఆ దేశ ప్ర‌జ‌ల క్ర‌మ‌శిక్ష‌ణ‌కు నిద‌ర్శ‌నంగా చెప్ప‌వ‌చ్చు. 

 

చిన్న‌దేశ‌మైన స్వీడన్‌లో 1.03 కోట్ల జ‌నాభా ఉంది. ఇక్క‌డ జనవరి 31న తొలికేసు న‌మోదైంది. మార్చి 9న స్టాక్‌హోమ్‌లో సామాజిక వ్యాప్తి దశను గుర్తించారు. మార్చి 11న స్వీడ‌న్‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం చోటుచేసుకుంది. స్వీడ‌న్‌లో ఇప్పటివరకు 20,302వేల క‌రోనా కేసులు న‌మోదుకావ‌డం గ‌మ‌నార్హం. 2,462మంది మ‌ర‌ణించారు. దేశ ప్రజల వ్యక్తిగత ప్రవర్తన పైనే వైరస్‌ వ్యాప్తి ఆధారపడి ఉంటుంద‌ని స్వీడ‌న్ నిరూపిస్తోంది. లాక్‌డౌన్ పాటించినంత మాత్ర‌నా అనుకున్న ఫలితాలు.. ఊహించుకుంటున్న ల‌క్ష్యాల‌ను చేరుకోలేమ‌ని స్వీడ‌న్‌ను అభిమానించే వారు పేర్కొంటున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: