కొన్నిరోజులుగా ఏపీలో ఆంగ్ల మీడియంపై వివాదం కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్ వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ తెలుగు మీడియం ను ఎత్తేస్తున్నారు. కేలవం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ రావాలని వారి భవిష్యత్ బావుండాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.


కానీ దీన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మాతృ భాషను చంపేస్తారా అని మండిపడుతున్నారు. అయితే నారాయణ సంస్థలకు ఆదాయం తగ్గిపోతుందనే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసు అని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఎన్‌టీఆర్‌ నుంచి సీఎం పీఠాన్ని లాక్కున్న ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.


ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలు టీడీపీ మానుకోవాలని హితవు పలికారు.విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా ఇంగ్లీస్‌ మీడియాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. అన్ని వర్గాలకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.2020 ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. జనసేన దారి ఎటువైపో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: