ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి.. ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టి పీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన  ఈ కొత్త‌ర‌కం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం వ్యాప్తిచెందింది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాయి. ఇక ఈ క‌రోనా ర‌క్క‌సికి అడ్డుక‌ట్ట వేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మ‌రికొంద‌రు ఉద్యోగాలు సైతం పోగొట్టుకుంటున్నారు.

 

అయితే ఇలాంటి స‌మయంలో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ-CIPET ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో మొత్తం 57 పోస్టులు భ‌ర్తీ చేస్తోంది. సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇప్ప‌టికే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్రారంభ‌మైంది. 2020 మే 1 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేది. ఇక ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది.. 2020 మే 29. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

 

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cipet.gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు. పోస్టుల వివ‌రాలు చూస్తే.. మొత్తం 57 పోస్టులు ఉండ‌గా.. సీనియర్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్)- 4, ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్)- 6, టెక్నికల్ ఆఫీసర్- 10, అసిస్టెంట్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ / ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 6, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3- 15, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్- 10అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్ గ్రేడ్ 3- 6 పోస్టులు ఉన్నాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: