బంగారం ధర నిలకడగా ఉండదన్న విషయం తెలిసిందే.. క్షణానికో రేటు మారుతుంది.. విదేశీ మార్కెట్ రేటు ను బట్టి బంగారం ధరలు పెరగడమో , తగ్గడమో జరుగుతుంది.నిన్న బంగారం ధర భారీగా తగ్గింది. అది విని సంతోషించే లోపు మళ్లీ పెరిగింది. బంగారం తగ్గిందనే ఆశ ఒక్కరోజు ముచ్చటగానే మిగిలిపోయింది. ఈరోజు రేట్లు పరుగులు పెడుతున్నాయి. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా దూసుకెళ్లింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో మాత్రం పసిడి పెరగడం జరిగింది.



ఇక హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర పైపైకి వెళ్ళింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరుగుదలతో రూ.51,330కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 పెరిగింది. దీంతో ధర రూ.47,050కు చేరింది. బంగారం ధర పెరిగినా, తగ్గినా కూడా వెండి ధరలు కూడా అదే దారి లో పయనిస్తున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన వెండి ధరలు ఈరోజు మళ్లీ భారీగా పెరిగింది.



ప్రస్తుతం కిలో వెండి ధర పై ఈరోజు ఏకంగా 1500 పెరిగింది.దీంతో వెండి ధర రూ.63,500కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి ఆర్డర్లు పెరగడంతో వెండి ధర మళ్లీ ఊపందుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.52 శాతం తగ్గుదల తో 1919 డాలర్లకు క్షీణించింది.. ఇక వెండి విషయానికొస్తే.. ఔన్స్‌కు 1.13 శాతం క్షీణతతో 24.94 డాలర్లకు చేరింది. డిమాండ్ పెరిగే కొద్ది బంగారం, వెండి ధరలు పైపైకి పెరుగుతుండటం తో పసిడి ప్రియులు ఆభరణాలు కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. మరి దసరా, దీపావళి కి అయిన బంగారం ధరలు పూర్తిగా తగ్గుతాయెమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: