మహిళలకు మార్చి ఒకటో తారీఖు న అదిరిపోయే గుడ్ న్యూస్..బంగారం ధరలు పూర్తిగా పడిపోయాయి. గత కొద్ది రోజులుగా పడిపోతున్న ధరలు ఈరోజు పూర్తిగా కిందకు వచ్చాయి.బంగారం ధర నెల ఆరంభంలోనే పడిపోయింది. పసిడి వెలవెలబోయింది. దిగొచ్చింది. బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర పడిపోతే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర నేటి మార్కెట్ లో మాత్రం భారీగా తగ్గింది.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగితే... దేశీయ మార్కెట్లో తగ్గుముఖం పడుతుంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.610 పడిపోయింది. దీంతో రేటు రూ.46,570కు తగ్గింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 560 తగ్గుదల తో రూ.42,690కు దిగొచ్చింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గితే , వెండి ధర మాత్రం పరుగులు పెడుతున్నాయి.


కానీ, ఈరోజు వెండి కూడా బంగారం ధరల దారిలోనే నడిచింది.వెండి ధర కేజీకి రూ. 800 పతనమైంది. దీంతో రేటు రూ.72,500 కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌ కు 0.62 శాతం పెరుగుదల తో 1739 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.6 శాతం పెరుగుదల తో 26.88 డాలర్ల కు ఎగసింది.. బంగారం ధరలు పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి రేపటి మహిళలకు ఎలా అనిపిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: