షుగర్ సమస్యతో బాధ పడేవారు కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ వారు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అలాగే టైం ప్రకారం ఖచ్చితంగా నిద్రపోవాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. మందులు వాడాలి. మానస్థితిని మెరుగుపర్చుకోవడం వంటి విషయాలపై జాగ్రత్త వహించాలి. అయితే మధుమేహాన్ని నియంత్రించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని నిరూపించబడింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో తెలుసుకుందాం.మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలను తక్కువుగా, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.బీట్ రూట్ లో ఎన్నో పోషకాలుంటాయి. ఈ కూరగాయలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మధుమేహ రోగులు తినగలిగిన హెల్తీ ఫుడ్. బీట్ రూట్ లో విటమిన్ సి, ఐరన్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని రోజూ తినొచ్చు.


క్యారెట్లను తింటే ఆరోగ్యంగా ఉండటమే కాదు.శరీరం కూడా ప్రకాశవంతంగా తయారవుతుంది. క్యారెట్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 39 గా ఉంటుంది. దీనిలో ఫైబర్, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉండే క్యారెట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినగలిగే ఉత్తమ కూరగాయ.టామాటాలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులోనూ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 30 ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటాలు తినడానికి ఉత్తమమైన ఆహారంగా చెప్పొచ్చు. టమోటాలు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పెరగవు. దీనిలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. బొప్పాయిని జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల మెరుగైన ఫలితాలొస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: