అమ్మాయిలందరూ అందంగా ఉండాలని ఎప్పుడూ ఏదోకటి చేస్తుంటారు .. అలాగే అనుకోని మేకప్ మీద మోజుతో, మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు.  అయితే, మేకప్ లో ముఖ్యంగా కనిపించేది లిప్స్టిక్.ఈ లిప్స్టిక్ ని పెదాలకు రాసుకోవడం వల్ల మరింత అందంగా మెరుస్తారని అనుకుంటారు అదే వాడుతుంటారు కూడా. అయితే ఈ లిప్స్టిక్ ని వాడటం వల్ల అందం ఎంత పెరుగుతుందో,దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
 
గర్భిణుల విషయానికొస్తే..  గర్భిణులూ కొంచం  జాగ్రత్త.. లిప్స్టిక్ లు, మాయిశ్చరైజర్లు తదితర సౌందర్య సాధనాలను వినియోగిస్తే… వాటిలోని రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల్లో శారీరక కదలికలు తక్కువయ్యే ప్రమాదముందట. ఇంకా వాళ్ళు ఎదుగుతున్న వయసు లో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు . బాడీలోషన్లను , అందానికోసం వాడే క్రీముల్లో సథాలేట్స్‌ అనే రసాయనాలుంటాయి. అందుకే వాటిని కొంచమే దూరం పెట్టడం బెటర్ అంటున్నారు. 

ఈ రసాయన పూరితమైన లోషన్లను ప్రెగ్నెంట్ వాళ్ళు కనుక వాడితే వాళ్లకు పుట్టబోయే పిల్లల్లో ఎన్నో సమస్యలు తలెత్తవచ్చునని చెప్పారు. ‘‘గర్భిణులు వాడే రసాయనాల కారణంగా వారికి పుట్టే పిల్లలు యుక్తవయసుకు వచ్చే సమయంలో చాలా ఇబ్బందులకు గురవుతారు. వహరణకు పళ్ళు సరిగ్గా రాకపోవడంతో పాటుగా  చురుగ్గా కదల్లేరు.
 
అంతేకాకుండా.. పైపెచ్చు ఆత్మన్యూనత, తీవ్రస్థాయి ఆందోళన, వ్యాకులత, ప్రవర్తన సంబంధ సమస్యలు వారిని చుట్టుముట్టే ప్రమాదముంది. వీటితో పాటు, వీళ్ళు ప్లాస్టిక్ వస్తువులను, ఫుడ్ నిల్వచేసే ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని వాడకుండా ఉండటం మంచిదంటున్నారు” డాక్టర్ ఫాక్టర్‌-లిత్వాక్‌ . చూసారుగా బ్యూటీ ఇంపార్టెంట్ అంతేగాని, ఆరోగ్యాన్ని పాడుచేసుకోనేంత వ్యామోహం పనికి రాదని అంటున్నారు వైద్యులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: