సాధార‌ణంగా పిండి పదార్ధాలు, కూర‌లు ఇలా ఏవి చేయాల‌న్నా నూనె ఖ‌చ్చితంగా కావాలి. మరి ఆ నూనె ఎలాంటిది వాడితే ఆరోగ్యానికి మంచిది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి కాలంలో ఒక్కొక్కరు ఒక్కో ఆయిల్‌ను వాడుతుంటారు. అయితే చాలా మంది ఆలివ్ ఆయిల్ మాత్రం దూరంగా పెడ‌తారు. దీని ప్ర‌ధానం కార‌ణం.. ఇందులో ఉండే కొవ్వులు, నూనెలూ ఎక్కువ వేడిని తట్టుకోలేవు. అవి హానికరంగా మారతాయ‌ని న‌మ్ముతారు. అయితే వాస్త‌వానికి ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనెను ఆలివ్ పండ్ల నుంచి తీయబడుతుంది.

 

వంట కోసం ఏ నూనె వాడాలి అన్న రెండు విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఒకటి స్మోక్ పాయింట్. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద కొవ్వులు పొగగా మారతాయి. రెండొది..ఆక్సిడేటివ్ స్టెబిలిటీ. ఆక్సిజెన్ తో ప్రతిచర్యను ఎంతవరకూ అడ్డుకుంటాయి. ఆలివ్ ఆయిల్ ఈ రెండు విషయాల్లోనూ ఎలాంటి సమస్య తీసుకురాదు. అలాగే ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు చేకూర్చుతుంది. అలాగే కొన్ని అధ్యయనాలు ప్ర‌కారం.. ఆలివ్‌ ఆయిల్ గుండె యొక్క వృద్ధాప్యాన్ని తగ్గించగలదని తేలింది. ధమనుల పనితీరుకు అడ్డంకుగా, అక్రమంగా నిర్మితమైన కొవ్వును తొలగించి, ధమనుల యొక్క రక్త ప్రసరణలను మరింతగా మెరుగుపరచి, గుండెపోటును రాకుండా చేస్తుంద‌ట‌.

 

అదేవిధంగా, ఆలివ్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల, హెల్తీ ఫ్యాట్స్ ను ప్రోత్సహించి పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. బట్టర్ కు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవడం ఉత్తమం. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆలివ్ ఆయిల్ ఉత్తమమైనది. చర్మాన్ని తేమగా చేస్తుంది. చర్మం డ్యామేజ్ కాకుండా పోషణను అందిస్తుంది. అలాగే తేమను కూడా అందిస్తుంది. మ‌రియు ఆలివ్ ఆయిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్,ఇమ్యూనిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబ‌ట్టి, ఎలాంటి భ‌యాలు లేకుండా ఆలివ్ ఆయిల్‌ను వంట‌కు యూజ్ చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: