శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే ఈ దగ్గు వ‌చ్చిందంటే ఓ ప‌ట్టాన పోదు. ద‌గ్గు రావ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉన్నాయి. శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. ఇక‌ దీనిని త‌గ్గించుకోవ‌డానికి ఎన్ని మందులు వాడినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అసలు వదిలిపెట్టదు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సింపుల్‌ చిట్కాల ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు.

 

అందులో ముందుగా.. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేయండి. ఆ తర్వాత నీటిని బాగా మరిగించండి. దీనివల్ల అల్లంలో ఉండే ఔషదాలన్నీ నీటిలో కలుస్తాయి. ఈ అల్లం నీరును రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే దగ్గు నుంచి పూర్తి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే వెల్లుల్లిని బాగా నూరి.. గంటక ఒకసారి దాని వాసన పీలిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. అప్పుడప్పుడు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగడం వల్ల కూడా ద‌గ్గు తగ్గుతుంది. అదేవిధంగా, కఫం దగ్గుతో బాధపడుతున్నట్లయితే గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి కలపండి. 

 

ఆ నీటిలో నోటిలో వేసుకుని బాగా పుకిలించండి. దీనివల్ల గొంతులో ఉండే శ్లేష్మం బయటకు వచ్చేస్తుంది. మ‌రియు ద‌గ్గు కూడా త‌గ్గుతుంది. మ‌రియు శ్వాసపై నియంత్రణ ద్వారా కూడా దగ్గును తగ్గించవచ్చు. ఇందుకు మీ ముక్కు ద్వారా లోతుగా శ్వాస పీల్చండి. అలా రెండు సెకన్ల పాటు ఉంచి గాలిని బయటకు వదలేయండి. దీనివల్ల కొద్ది క్షణాల్లో దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇక రాత్రి నిద్రించే ముందు కొద్దిగా పసుపు తీసుకుని.. అందులో నీళ్లు కలిపి ఉండలా చేసి మింగి పడుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా దగ్గు నుంచి విముక్తి పొందొచ్చు. లవంగం బుగ్గన పెట్టుకున్నా దగ్గు తగ్గుతుంది.

 

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: