పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణ ధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యులు సూచిస్తారు ఇందులో పండ్లు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం.



ఎండా కాలంలో చెమట కారణంగా మనలో నీరసం, అలసట వంటివి రావడంతో జీవ క్రియ వేగం తగ్గే ప్రమాదం ఉంటుంది. అందుకే వేసవి కాలంలో ఎక్కువగా పండ్ల రసాలను తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. జ్యూస్ చేసుకుని తాగినా లేదా సలాడ్స్ రూపంలో తీసుకున్నా మంచిదే. పండ్ల రసాలనే పూర్తి స్థాయి ఆహారంగా తీసుకునేటప్పుడు అందులో చక్కెర లేదా ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. వీటిని వేయడం వల్ల పోషక విలువలు తగ్గే ప్రమాదం ఉంది. అందుకే వేసవి కాలంలో ఎక్కువ జ్యూసులు తాగినా సరే.. వాటిని పోషకాహారం లానే చూడాలి తప్ప కూల్ డ్రింక్‌లా భావించి స్వీటెనర్స్ కలిపేయకూడదు.పళ్ల రసాల కంటే తాజా పండ్లనే తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాదాపు అన్ని రకాల పండ్లలో పీచు పదార్థం ఎక్కవ స్థాయిలో ఉంటుంది.



పండ్లు తినడం ఆరోగ్యదాయకమే కాని వాటి యొక్క సుగుణం పొందాలంటే ఏంచేయాలి. మనం పండ్లు కొనడం వాటిని కట్ చేసి లేదా కొరుక్కుని తినడమే కాదు. ఇది మనం అనుకున్నంత సులభం కాదు. పండ్లు ఎలా మరియు ఎప్పుడు తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు పండ్లు తినడానికి సరైన మార్గం ఏమిటి? భోజనం తర్వాత పండ్లు తినకూడదు, ఖాళీ కడుపుతో మాత్రమే తినాలి. ఎవరైనా ఖాళీ కడుపుతో పండ్లను తినడం వలన శరీరం లోని ప్రధానంగా అవయావాల వ్యవస్థను ఆరోగ్యకంగా చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊబకాయులు బరువు తగ్గడం మరియు ఇతర జీవిత కార్యకలాపాలకు అధిక శక్తిని అందిస్తుంది.


రోజులో ఎప్పుడు పడితే అప్పుడు పండ్లను తినకూడదు. ముఖ్యంగా ఉదయం 12 గంటల లోపే పండ్లను తింటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా కుదరని వాళ్లు సాయంత్రం స్నాక్స్‌లాగైనా తీసుకోవచ్చుగానీ రాత్రిళ్లు డిన్నర్ తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడం మాత్రం శ్రేయస్కరం కాదు.భోజనం తిన్న వెంటనే మాత్రం పండ్లను లేదా పళ్ల రసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా శరీరం బరువు పెరుగుతారు. జీర్ణ వ్యవస్థపైనా దుష్ప్రభావం చూపిస్తుంది.యాపిల్, కమలా పండు, నిమ్మ, జామ, బొప్పాయి వంటి పండ్లను ప్రతి రోజూ తీసుకోవచ్చు. చక్కెర శాతం ఎక్కువగా ఉండే ద్రాక్ష, అరటి పండు, బెర్రీస్, మామిడి వంటి ఫలాలను వారానికి రెండు సార్లకు మించకుండా తీసుకుంటే మంచిది

మరింత సమాచారం తెలుసుకోండి: