కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి టీకా తప్పనిసరిగా తీసుకోవాలనే సంగతి అందరికీ తెలిసినదే.ఇక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇప్పటికే వివిధ రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి.ఇక మన దేశంలో చూసుకుంటే కొవ్యాక్సిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ మనకి అందుబాటులో ఉన్నాయి. కరోనా మహమ్మారి ఎక్కువవడంతో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలి.

వీలైనంత వరకు వ్యాక్సిన్ వేయించుకుని ఇంట్లో ఉండటం చాలా మంచిది. బయటకు వెళ్లకుండా కేవలం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి.అదే విధంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రష్యన్ వ్యాక్సిన్ ని మన భారతదేశానికి తీసుకు వస్తున్నట్టు కూడా తెలిసినదే.ఇక కోవిషీల్డ్, కోవాక్సిన్ ఈ రెంటిలో ఏది మంచిదో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు.


ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ విషయానికి వస్తే ఇది..ఇది వాడిన కొంతమందికి తల నొప్పి, నీరసం, టీకా చేసిన ప్రదేశంలో నొప్పి కలగడం, ఫ్లూ ఇలాంటి అనారోగ్య సమస్యలు లాంటి సైడ్ ఎఫెక్ట్ లు వస్తున్నట్లు తెలుస్తోంది.టీకా చేసిన ప్రదేశం లో నొప్పి కలగడం, ఎర్రగా మారడం, జ్వరం ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండడం, ఒళ్లు నొప్పులు వంటివి వస్తాయి.ఇక కొవ్యాక్సిన్ విషయానికి వస్తే..దీనిని దేశీయా వ్యాక్సిన్ తయారీ సంస్థ హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది. ఇది కూడా కరోనా వైరస్ వచ్చే ప్రమాదం తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.


ఇప్పటికీ చాలా మంది ఈ వ్యాక్సిన్ ని తీసుకున్నారు అయితే ఏది ఏమైనా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం దీనిలో కూడా సహజం.కొవ్యాక్సిన్ ని తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయనే విషయం చూస్తే...వ్యాక్సిన్ వేసిన ప్రాంతంలో ఎర్రగా అవడం వల్ల నొప్పి కలగడం లాంటివి జరుగుతాయి. జ్వరం, చెమట పట్టడం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, దురద కలగడం లాంటివి రావడం తల నొప్పి కలగడం లాంటివి కొవ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వచ్చే ఇబ్బందులు. గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు, బ్లీడింగ్ డిసార్డర్స్, అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయ్ అనుకునే వాళ్ళు దీనికి దూరంగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: