నీరు మన శరీరానికి చాలా అవసరం. నీరు తాగానిదే మనం బ్రతకలేము. కాని నీళ్లు ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి. ఇక పండ్లు తిన్న తర్వాత నీళ్లు అస్సలు తాగకూడదు. పండ్లలో 80 నుంచి 90 శాతం దాకా నీరు ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందులో ఉంటాయి.ఇక ఇది కాకుండా పండ్లలో షుగర్ కంటెంట్ లేదా సిట్రిక్ యాసిడ్ లు కూడా ఉంటాయి. అందుకే ఏమైన పండ్లు తిన్న తరువాత 45 నిమిషాల వరకు నీరు అస్సలు తాగకూడదు.ఇక ఐస్ క్రీం తిన్న వెంటనే అస్సలు నీరు తాగకూడదు. ఇక ఇలా చేస్తే ఖచ్చితంగా దంత సమస్యలు అనేవి వస్తాయి. అలాగే చిగుళ్లు చాలా బలహీనంగా మారతాయి. గొంతు నొప్పి సమస్య కూడా ఎక్కువవుతుంది.ఇక ఐస్ క్రీం తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత కూడా నీరు తాగవచ్చు.

టీ లేదా కాఫీ ఏదైనా వేడి పానీయం తాగిన తర్వాత నీరు అస్సలు తాగవద్దు. కూల్ లేదా వేడి కలిపి అసలు ఎప్పుడు తీసుకోకూడదు. అలా చేస్తే జీర్ణవ్యవస్థ అనేది చాలా మందగిస్తుంది. కడుపులో బరువు, వాయువు ఇంకా ఆమ్లత్వం వంటి సమస్యలు అనేవి వస్తాయి.ఇక వేరుశెనగ తిన్న తర్వాత కూడా నీరు తాగాలనే కోరిక అందరికి ఉంటుంది. కానీ అలా నీరు తాగకూడదు. వేరుశనగ ఇంకా నీరు రెండూ ఒకదానికొకటి చాలా విరుద్దమైనవి. అందువల్ల అది తిన్న వెంటనే నీరు తాగితే దగ్గు ఇంకా గొంతు నొప్పి సమస్యలు అనేవి వస్తాయి.ఇక భోజనానికి 45 నిమిషాల ముందు 45 నిమిషాల తర్వాత నీరు అస్సలు తాగకూడదు. ఇక అన్నం తినేటపుడు తరచూ నీరు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ అనేది మందగిస్తుంది.అందుకే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.అందువల్ల ఊబకాయం వచ్చే సమస్యలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: