మన బాడీలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో మెదడు మొదటి ప్లేసులో ఉంటుంది.దానిని ఆరోగ్యంగా ఉంచడానికి ఖచ్చితంగా సరైన పోషకాహారం అవసరం.నిజానికి మెదడు మన తలభాగంలో కపాలంతో రక్షించబడి ఉంటుంది.మన జ్ఞానేంద్రియాలన్నింటికి మెదడు ఎంతో ముఖ్యమైన కేంద్రం.అన్ని అవయవాల్లో మెదడు చాలా స్పెషల్. ఎందుకంటే మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకునే గుణం ఉటుంది. ఇంకా మనం ఏం చేయాలన్నా.. తినాలన్నా కూడా మెదడు ఆజ్ఞతోనే జరుగుతుంది. మన మెదడు బలంగా ఉంటేనే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే మిగిలిన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మెదడును పట్టించుకోకపోతే అంతా వ్యర్థమే.. ఏమి ఉపయోగం ఉండదు.అయితే, మన మెదడుకు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి.వీటి వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ.. కొన్ని ఆహారాలు మాత్రం మెదడుకు ఖచ్చితంగా తీవ్ర హాని కలిగిస్తాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కొందరు టీ,కాఫీని కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ రెండింటిలోనూ పెద్ద మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది నేరుగా నాడీ కణాలను ప్రభావితం చేస్తుంది. నిద్రను దూరం చేయడానికి సహాయపడుతుంది.


ఇది దీర్ఘకాలంలో మెదడుకు మంచిది కాదు.ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు బాధితులుగా మారతారు. అంతేకాకుండా, ఆయిల్ ఫుడ్ కూడా మన మెదడుకు హాని చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు, డాల్డా వంటి అధిక మొత్తంలో నూనె, కొవ్వు ఉన్న ఆహారాలు మెదడు ఆరోగ్యానికి హానికరం.ఇంకా అలాగే పంచదార లేదా తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని మనం తరచుగా చెబుతుంటాం. కానీ మితిమీరిన తీపి పదార్థాలు తినడం మెదడుకు మంచిది కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను కలిగించడమే కాకుండా మెదడుకు గణనీయమైన నష్టాన్ని కూడా కలిగిస్తుంది.చాలా మంది వేగంగా తింటారు. అయితే వేగంగా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, మెదడుకు సరైన మొత్తంలో న్యూరోట్రాన్స్‌మిటర్లు అందవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైగా ఇది పొగాకును ఎక్కువగా తీసుకున్న దానికంటే హానికరం.. అతివేగంగా తినడం, ధూమపానం రెండూ కూడా మన జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: