సాధారణంగా పిల్లలు అనారోగ్యంతో ఉన్నపుడు ఏం తినడానికి ఇష్టపడరు. ఇక వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కడుపు మాడ్చకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక శక్తితో కూడిన ధాన్యాలు, పాలు, ఉడికించిన కూరగాయలు కొంచెం చొప్పున ఎక్కువ సార్లు అందించాలని చెబుతున్నారు. ఇక వారికీ పుష్కలంగా నీరు, ద్రవ పదార్థాలు ఇవ్వాలని చెబుతున్నారు. అయితే డీహైడ్రేషన్ రాకుండా అవసరమైతే ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకాన్ని తాగించాలని తెలిపారు. అంతేకాదు.. పిల్లలకు పోషకాహారంతో కూడిన భోజన నమూనాను తెలిపారు.

ఇక పిల్లలకు ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చని, ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలను తాగించాలన్నారు. అయితే ల్పాహారం కింద కోడిగుడ్డు ఆమ్లెట్, ఉల్లిగడ్డలు, టమాటా, పాల కూర, ముడి ధాన్యాలు, యాపిల్ ని అందించాలి. అంతేకాదు.. ఉదయం 11 గంటల సమయంలో ఫ్రూట్ సలాడ్, తక్కువ ఫ్యాట్ ఉన్న యోగర్ట్ వంటి అందజేయాలి. ఇక మధ్యాహ్నం భోజనం కింద రైస్, పండ్ల రసం. మాంసాహారులైతే లీన్ చికెన్ అని చెప్పాలి.

అలాగే సాయంత్రం పాలకూర, పుట్టగొడుగుల కట్ లెట్. బాదం గింజలతో తాజా పండ్ల రసం వంటివి అందజేయాలని చెపుతున్నారు.  ఇక రాత్రి భోజనం కింద మల్టీ గ్రెయిన్ పుల్కాలు, పప్పు, పనీర్, పుట్టగొడుగులతో కూడిన కూర తీసుకోవాలని అన్నారు. అయితే నిద్రకు ముందు గ్లాస్ గోరువెచ్చని పాలు తాగాలని తెలిపారు.

అంతేకాదు.. చిన్నారులకు గోధుమలతో కూడిన ఆహారం ఇవ్వడం సరికాదని డాక్టర్ కాశిష్ ఎ చాబ్రియా చెప్పుకొచ్చారు. ఇక దీనిలో గ్లూటెన్ ఉండడం వల్ల పేగులను జిగటలా మార్చి ఆహారాన్ని సరిగా ముందుకు పోనివ్వదని వెల్లడించారు. అయితే చాలా మంది పిల్లలకు గ్లూటెన్ పడదు కనుక, దాన్ని డైట్ నుంచి మినహాయించడం మంచిదని అన్నారు. ఇక పిల్లలకు రోజువారీ శారీరక శ్రమ అవసరం. బలమైన ఎముకలు, తగినంత కండరాల బలం కోసం శారీరక కదలికలు ఉండేలా చూడాలని అన్నారు. అయితే నడక, పరుగు, ఇతర క్రీడలు ఉపయోగపడతాయని తెలిపారు. ఇక ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకం అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: